: E-Autos ప్రారంభించిన AP CM Jagan డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం | Telugu OneIndia

2023-06-08 8,627

AP CM YS Jagan inaugurates E Autos for Garbage Collection usage in the part of Clean Andhra Pradesh
పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ-ఆటోలను) ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.'ఈ- ఆటోల' డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. వీటిని 36 మున్సిపాల్టి లకు పంపిణీ చేస్తారు.రూ.4.10 లక్షల విలువైన 516 ఈ-ఆటోలను మొత్తం రూ.21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ 'ఈ- ఆటోల' డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్‌-1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్‌ టిప్పర్లను వినియోగిస్తోంది.

#EAutos #JaganannaSwachaSankalpam #CleanAndhraPradesh #APAssemblyElections2024 #apcmjagan #YSRCP #SurakshaChakra #TDP #WelfareSchemes
~PR.40~PR.41~